జ‌గ్గుభాయ్ తో గొడ‌వ‌.. అందుకేనా ఎగ్జిట్ !

-

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో స‌రిలేరు నీకెవ్వ‌రు షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇంద‌లో విజ‌య‌శాంతి, జ‌గ‌ప‌తిబాబు, రాజేంద్ర ప్ర‌సాద్ ల‌ను కీల‌క పాత్ర‌ల‌కు ఎంపిక చేసారు. ఇప్ప‌టికే కాశ్మీర్ షెడ్యూల్ కూడా పూర్తిచేసారు. అయితే షూటింగ్ లో పాల్గొన‌కుండానే జ‌గ‌ప‌తిబాబు అలియాస్ జ‌గ్గుభాయ్ సినిమా నుంచి త‌ప్పుకున్నాడుట‌. ఆ స్థానంలో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ను ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. మ‌రి ఉన్న‌ట్లుండి జ‌గ్గుభాయ్ ఎందుకు త‌ప్పుకున్న‌ట్లు? మ‌హేష్ తో మంచి రిలేష‌న్ ఉన్న జ‌గ‌ప‌తి త‌ప్పుకోవ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటి? అని ఆరా తీయ‌గా కొన్ని రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.

Jagapathi Babu upset by unprofessional ouster from Sarileru Neekevvaru

ఇందులో జ‌గ‌ప‌తి బాబు పాత్ర విష‌య‌మై ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి- జ‌గ‌ప‌తి బాబు మ‌ధ్య మాట తేడా వ‌చ్చింద‌నే ఓ రూమ‌ర్ వినిపిస్తోంది. వారం రోజుల క్రింద‌ట‌నే ఇది జ‌రిగింద‌ని స‌మాచారం. ద‌ర్శ‌కుడి వ్వ‌వ‌హార శైలి న‌చ్చ‌కే జ‌గ్గ్గుభాయ్ త‌ప్పుకున్నాడ‌ని వినిపిస్తోంది. ఇందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియ‌దు గానీ సోర్సెస్ మాత్రం కార‌ణంగా అదే చూపిస్తున్నాయి. ప‌రిశ్ర‌మ‌లో జ‌గ‌ప‌తి బాబు వెరీ కామె గోయింగ్ ప‌ర్స‌న్. వివాదాల‌కు దూరంగా ఉండే వ్య‌క్తి. త‌న ప‌ని తాను చూసుకుంటాడు త‌ప్ప అన‌వ‌స‌రంగా మాట్లాడేట టైపు కాదు. ఆయ‌న గురించి తెలిసిన వాళ్లంతా చెబుతున్న మాట‌లివి. ఇక ఏ విష‌యంపైనైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్య‌క్తిత్వం గ‌ల‌వాడు. త‌న‌కు అమ్మాయిలంటే పిచ్చి అని ప‌బ్లిక్ గా చెప్పిన స్టార్. త‌న కెరీర్ డౌన్ ఫాల్ లో ఉండ‌టానికి అదీ ఓ కార‌ణం అని మాట‌ల సంద‌ర్భంలో అన్నాడు.

ఒక‌ప్ప‌డు ఫ్యామిలీ హీరోగా జ‌గ‌ప‌తి బాబుకు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉండేది. హీరోగా ఓ వెలుగు వెలిగాడు. అయితే ఆ ఫ్యామిలీ స్టోరీలు ఔడెటెడ్ అయ్యే స‌రికి హీరోగా అవ‌కాశాలు త‌గ్గాయి. అటుపై వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల‌ హీరో నుంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ట‌ర్న్ తీసుకోవాల్సి వ‌చ్చింది. ఆ నిర్ణ‌యంతో చాలా మంది ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు విల‌న్ గా, సపోర్టింగ్ రోల్స్ కు బెస్ట్ ఆప్ష‌న్ గా నిలిచాడు. గ‌తి లేక‌ బాలీవుడ్ కి వెళ్లి వాళ్ల‌ని…వీళ్ల‌ని తెచ్చుకునే బ‌ధులు జ‌గ‌ప‌తి ఉన్నాడు క‌దా! అన్న భ‌రోసా క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version