జగ్గారెడ్డి జగడం: సోలో ఫైట్ అప్పటివరకేనా!

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారంపై పెద్ద రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి జగ్గారెడ్డి తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. రేవంత్ టార్గెట్‌గా పరోక్షంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు…అలాగే తనకు రేవంత్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఫైర్ అవుతున్నారు. ఇక జగ్గారెడ్డి విమర్శలకు రేవంత్ రెడ్డి వర్గం కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది..జగ్గారెడ్డి టీఆర్ఎస్ కోవర్టు అంటూ విమర్శలు చేస్తుంది.

ఇలా విమర్శలు రావడంతో జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు..ఈ క్రమంలోనే సీనియర్లు బ్రతిమలాడటంతో మరో 15 రోజుల పాటు వేచి చూస్తానని, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్‌ దొరికితేనే తాను ఢిల్లీకి పోతానని,  అధిష్ఠానం అపాయింట్‌మెంట్‌ను సీనియర్లు ఇప్పిస్తే తన ఆవేదననంతా సోనియా, రాహుల్‌కే చెబుతానని అన్నారు.

అయితే సోనియా, రాహుల్ అపాయింట్‌మెంట్‌ జగ్గారెడ్డికి దొరుకుతుందా? లేదా? అనేది చెప్పలేని పరిస్తితి. ఒకవేళ అపాయింట్‌మెంట్‌ దొరికితే వారిని కలిసి మాట్లాడి…మళ్ళీ కాంగ్రెస్‌లో కొనసాగుతారా? లేక అప్పుడు కూడా పార్టీని వీడతారో చెప్పలేని పరిస్తితి. అలాగే 15 రోజుల్లో అపాయింట్‌మెంట్‌ దొరకకపోయినా సరే జగ్గారెడ్డి కాంగ్రెస్‌ని వీడేలా ఉన్నారు. ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికే జగ్గారెడ్డి చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏ పార్టీలో చేరకుండా సోలోగానే ఫైట్ చేస్తానని జగ్గారెడ్డి చెబుతున్నారు.

కానీ రేవంత్ వర్గం మాత్రం అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది..ఏదో ఎన్నికల వరకు ఇండిపెండెంట్ అన్నట్లు కాలం గడిపి, ఎన్నికల ముందు టీఆర్ఎస్‌లో చేరిపోతారని రేవంత్ వర్గం చెబుతుంది…ఇప్పటికే పోతే పోనీ అనే ధోరణిలో రేవంత్ వర్గం ఉందని తెలుస్తోంది. ఆ విషయం అర్ధం చేసుకున్న జగ్గారెడ్డి..పార్టీ నుంచి బయటకు పంపండి అని మాట్లాడుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి తుఫానుకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version