గత రెండు, మూడు రోజుల నుంచి జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు వీహెచ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటి అయ్యారు. ఆ సమావేశం అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలతో కొంత మనోవేదన చెందాను. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి కట్టుబడి ఉంటాను.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాతో ఫోన్‌లో మాట్లాడారు. అందరం కూర్చొని ఒకసారి మాట్లాడదాం. ముఖ్యంగా రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని, తొందర పడవద్దని ఉత్తమ్ కోరారు. మీ అభిప్రాయాలను ఢిల్లీ వెళ్లి చెప్పాలని సలహా ఇచ్చారు. అదేవిధంగా కొద్ది రోజుల పాటు మీడియాతో కూడా మాట్లాడవద్దని సూచించారు. 10 రోజుల తరువాత నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఢిల్లీ వెళ్లి వచ్చాక నా నిర్ణయం ప్రకటిస్తాను అని జగ్గారెడ్డి చెప్పారు.