తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ఇంకా పెరుగుతుందే తప్ప..తగ్గడం లేదు…రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బలపడాల్సింది పోయి…ఇంకా వీక్ అవుతూ వస్తుంది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఘోరంగా ఓడిపోయి…అధికారానికి దూరమైంది. ఇక మూడో సారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు…ఇంకా నెరవేరేలా లేవు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అనేక సంక్షోబాలు నడుస్తున్నాయి…ఆ పార్టీని చాలామంది నేతలు వీడారు…ఎమ్మెల్యేలు పార్టీని వదిలేశారు.
అయితే కరుడుకట్టిన కాంగ్రెస్ వాదులు సైతం పార్టీని వీడటం…ఆ పార్టీని కలవరపెడుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…కాంగ్రెస్ ని వీడారు. ఇక అదే బాటలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారని కథనాలు వస్తున్నాయి. కానీ తాను కాంగ్రెస్ వాదినని…కాంగ్రెస్ పార్టీని వీడనని చెప్పేస్తున్నారు. అదే సమయంలో రాజగోపాల్ పై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డిపై…వెంకటరెడ్డి కూడా ఫైర్ అయ్యారు. అలాగే తన తమ్ముడు పార్టీ మార్పుపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పైగా రేవంత్ మాదిరిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్ ఇవ్వకుండా ఉండటం లేదని, రాజగోపాల్…రాజీనామా లెటర్ ని స్పీకర్ కు ఇస్తున్నారని సమర్ధిస్తున్నారు.