వ్యవసాయ పరిశోధనకు బడ్జెట్ ఎందుకు పెంచలేదు ? – కేంద్రంపై సాయిరెడ్డి ఫైర్‌

-

వ్యవసాయం పరిశోధనకు బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయింపులను ఎందుకు పెంచడం లేదని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా వ్యవసాయ మంత్రిని అనుబంధ ప్రశ్న వేస్తూ 2021-22లో సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం వ్యవసాయ పరిశోధనకు 8,514 కోట్ల కేటాయింపులు జరిగాయి. 2022-23 బడ్జెట్‌లో సైతం అంతే మొత్తం కేటాయించారు. వ్యవసాయ పరిశోధనకు ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు.

ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల వలన సంభవిస్తున్న అకాల వర్షాల వంటి సమస్యలతో ఏటా పంటలు నష్టపోతూ రైతాంగం కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే వంగడాలను అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ పరిశోధనపై భారీగా ఖర్చు చేయవలసిన అవసరం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందో వివరించాలని ఆయన ప్రశ్నించారు. దీనికి వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్‌ చౌదరి జవాబిస్తూ వ్యవసాయ పరిశోధనను ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోను విస్మరించబోదని చెప్పారు. పరిశోధనకు మరిన్ని నిధులు కావాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చి (ఐసీఏఆర్‌) కోరితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version