తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కాకరేపబోతున్నారా… అంటే పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి రాజీనామా యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేపు సంగారెడ్డిలో కార్యకర్తలు, అనుచరులతో సమావేశం కానున్నారు జగ్గారెడ్డి. ఈ సమావేశం అనంతరం జగ్గారెడ్డి కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకునేందుకే కార్యకర్తలతో భేటీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
పార్టీలో తనకు గుర్తింపు దక్కడం లేదని.. గుర్తింపు లేని చోట పనిచేయడం అవసరమా.? అన్నట్లు ఆలోచిస్తున్నారు జగ్గారెడ్డి. దీంతో సొంత పార్టీపై తీవ్ర అసంత్రుప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ ఛీఫ్ అయిన తర్వాత నుంచి జగ్గారెడ్డికి పార్టీకి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల పలుమార్లు సీఎం కేసీఆర్ ను జగ్గారెడ్డి పొగిడారు. ఇటీవల కళ్యాణ లక్ష్మీ పథకంపై ప్రశంసలు కురిపించారు. దీంతో టీఆర్ఎస్ లో జగ్గారెడ్డి చేరబోతున్నారంటూ.. రూమర్స్ వినిపిస్తున్నాయి.