Breaking : కాంగ్రెస్ పార్టీకి జ‌గ్గారెడ్డి రాజీనామా!

-

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి రాజీనామా వ్య‌వ‌హారం ముగింపు ద‌శకు చేరుకుంద‌ని తెలుస్తోంది. ఆయ‌న కాసేప‌టి క్రిత‌మే కాంగ్రెస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన‌ట్టు స‌మాచారం. కాగ జ‌గ్గా రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా వ్య‌వ‌హారంలో ఆ పార్టీ నాయ‌కులు తీవ్రంగా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. అయినా.. జ‌గ్గా రెడ్డి రాజీనామా విషయంలో వెన‌క్కి త‌గ్గ‌లేద‌ని తెలుస్తోంది. అలాగే నేడు జ‌రిగిన సీఎల్పీ స‌మావేశంలో కూడా జ‌గ్గా రెడ్డి రాజీనామా నిర్ణ‌యంపై వెన‌క్కి త‌గ్గ‌డానికి స‌సేమీరా అన్నాడ‌ని స‌మాచారం.

కాగ నేడు జ‌రిగిన సీఎల్పీ స‌మావేశంలో.. జ‌గ్గా రెడ్డి తో పాటు భ‌ట్టి విక్ర‌మార్క‌, దుద్దీల శ్రీ‌ద‌ర్ బాబు, కోమ‌టి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో నేత‌లు.. జ‌గ్గా రెడ్డిని బుజ్జగించార‌ని తెలుస్తోంది. అయితే తాను స‌మాచారం ఇవ్వ‌డానికే సీఎల్పీ స‌మావేశానికి వ‌చ్చాన‌ని.. రాజీనామా విషయంలో వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని జ‌గ్గా రెడ్డి స్ప‌ష్టం చేశార‌ని స‌మాచారం. కాగ నేడు రాజీనామా చేసిన జ‌గ్గా రెడ్డి రేపు అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version