రచ్చబండ రచ్చ: రేవంత్‌ రెడ్డికి జగ్గారెడ్డి షాక్..!

-

పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో షాక్ ఇచ్చారు. ఇవాళ ఎర్రవెల్లి లో రేవంత్ రెడ్డి ప్రకటించిన రచ్చబండ కార్యక్రమం… ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిందని.. ఆ జిల్లా లో ఏకకై ఎమ్మెల్యే తానేనని.. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ ప్రెస్ మీట్ పెట్టేసమయంలో కానీ కార్యక్రమం ప్రకటించే టప్పుడు కానీ తనతో చర్చించలేదు ..ఇది బాధాకరమన్నారు.

జిల్లాలో రేవంత్ రెడ్డి ఏదైన కార్యక్రమం తీసుకుంటే మా తో చర్చించి నిర్ణయం తీసుకున్నారని అనుకుంటారు కానీ మా తో చర్చించకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటాడని ఫైర్ అయ్యారు. ఇది గతంలో నేను ఎప్పుడైనా ఇలాంటి విషయాలు మీడియా ముందు ఐన మీటింగ్ లో మాట్లాడితే నన్ను మాట్లాడవద్దని వదిలేయమని చెప్పేవారని… ఇలాంటి కార్యక్రమాలను ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటే పార్టీ కి నష్టం జరుగుతుంది…కాబట్టే నేను మీడియా ముందు ఇప్పుడు ప్రకటన చేయాల్సివస్తుందని తెలిపారు.

మాకు తెలియకుండా ఆయన ప్రకటించిన రచ్చబండ కార్యక్రమంలో మేము కనపడకపోతే మా పై రాంగ్ సిగ్నల్ తీసుకెళ్లిన్నట్లే కదా రేవంత్ రెడ్డి..ఈ హక్కు రేవంత్ రెడ్డి కి ఎవరు ఇచ్చారని ఫైర్ అయ్యారు. పీసీసీ అంటే అందరిని కలుపుకొని పోయే పోస్ట్.అందరిని విడదీసే పోస్ట్ కాదని చురకలు అంటించారు. ఇవాల్టి ఎర్రవెల్లి కార్యక్రమాన్ని తాను బాయ్ కట్ చేస్తున్నానని… రేవంత్ కు షాక్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version