కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేయడంపై జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ లోకి పోతారని ఎదుటి పార్టీ కంటే మన పార్టీ వాళ్ళే ఎక్కువ ప్రచారం చేస్తున్నారని.. మళ్లీ ఎవరు దీనిపై చర్చ చేయకండనిఫైర్ అయ్యారు. తాను టీఆర్‌ఎస్ లోకి పోను… బీజేపీ చర్చ అసలే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ లో ఉండాలా… సొంత పార్టీ పెట్టాలా అనేదే తన ఆలోచన అని వెల్లడించారు.
రాజీనామా..కొత్త పార్టీ అనే చర్చ ఈ రోజు లేదని… మీ అందరి ఆలోచన ఏంటని నాకు తెలుసు అన్నారు. కాంగ్రెస్ లో ఉండాలా వద్దా..? అని కార్యకర్తల అభిప్రాయం అడిగానని జగ్గారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ లో ఉండాలని కార్యకర్తలు కోరారని.. పార్టీ మారాలి అనుకుంటే మీకు చెప్పి పోనా..? అని తెలిపారు.
సొంత పార్టీ పెడితే ఎంత మంది నాతో వస్తారు ? అని అడిగానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. నేను ఇండిపెండెంట్ గా ఉండాలని అనుకుంటున్నానని జగ్గారెడ్డి చెప్పారు. 2018 ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత వరుసగా ఎన్నికలు వచ్చాయి… తర్వాత కరోనా తో.. 20 నెలలు కలవ లేని పరిస్థితి వచ్చిందన్నారు. ఈ రెండేళ్లు మనకు చేతనైన సాయం చేశామని చెప్పారు. సోనియా, రాహుల్ గాంధీలతో మాట్లాడే వరకు రాజీనామా ప్రసక్తే లేదన్నారు జగ్గారెడ్డి.