సైబర్ నేరగాళ్ల ఉచ్చులో జగిత్యాల కుర్రాళ్లు.. లావోస్ నుంచి తప్పించుకుని!

-

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ మధ్యకాలంలో డిజిటల్ పేమెంట్స్ లావాదేవీలు పెరగడంతో సాధారణ ప్రజలు సైతం ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనినే ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త దందాలకు తెరలేపుతున్నారు.తాజాగా ఓ ఏజెంట్ ఉచ్చులో పడి జగిత్యాల యువకులు మోసపోయారు.

లావోస్‌ దేశంలో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో నలుగురు యువకుల నుంచి వంశీ అనే ఏజెంట్ రూ.2 లక్షల చొప్పున వసూలు చేశాడు. వారిని లావోస్‌లోని ఓ కంపెనీలో బిట్ కాయిన్ సెల్స్ అండ్ ప్రమోటింగ్ పేరుతో పనిలో పెట్టాడు. అక్కడున్న బాస్ ఆన్‌లైన్‌ క్లయింట్స్‌తో చాట్ చేసి వాళ్ల బ్యాంక్ అకౌంట్స్‌ను జీరో చేయడమే వారి ఉద్యోగం అని నమ్మించాడు. దీంతో షాక్‌కు గురైన యువకులు అక్కడి నుంచి ఎలాగైనా బయట పడాలని నిర్ణయించుకున్నారు. ఎలాగోలా బయట పడిన యువకులు ఈనెల 7న హైదరాబాద్‌ చేరుకున్నారు.ఉద్యోగాల పేరుతో తమను మోసం చేసిన ఏజెంట్ వంశీపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news