‘జై భీమ్’ ట్రైలర్ రిలీజ్.. లాయర్ గా దుమ్ము లేపిన సూర్య!

-

తమిళ స్టార్‌ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తమిళ నాట సూర్య కు ఎంతటి ఫాలోయింగ్‌ ఉందో తెలుగు లోనూ కూడా అంతే ఫాలోయింగ్‌ ఉంది. అయితే.. గతేడాది ఆకాశం నీ హద్దురా సినిమా తో సూపర్‌ డూపర్‌ హిట్‌ ను అందుకున్నాడు హీరో సూర్య. ఇక ప్రస్తుతం జ్ఞానవేల్‌ దర్శకత్వం లో జై భీమ్‌ సినిమా చేస్తున్నాడు హీరో సూర్య.

ఈ సినిమా కూడా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నారు. నవంబర్‌ 2 వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌ లో రిలీజ్‌ కాబోతుంది. ఇక ఈ సినిమాను సూర్య మరియు జ్యోతిక లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సీన్‌ రోల్డాన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. జై భీమ్ సినిమా ట్రైలర్ ను కాసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈ ట్రైలర్ లో హీరో సూర్య… లాయర్ గెటప్ లో కనిపించారు. లాయర్ గెటప్ లో కనిపించిన సూర్య అదిరిపోయే నటనను ప్రదర్శించారు. ప్రజల పక్షాన పోరాడుతూ… అందరినీ కనువిందు చేశాడు సూర్య. మొత్తానికి ఈ ట్రైలర్ తో జై భీమ్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. కాగా ఈ సినిమా నవంబర్ 2వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version