నా కెరీర్ లో కొట్టిన సిక్సులను జైస్వాల్ ఒక్క మ్యాచ్ లో కొట్టాడు: అలిస్టర్ కుక్

-

టీమిండియా యువ బ్యాట్స్ మెన్ యశస్వి జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా అవసరం పనిలేదు. జట్టులో స్థానం పొందిన కొన్నాళ్లకే పూర్తి స్థాయి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జైస్వాల్ ఇంగ్లాండ్‌ తో జరుగుతున్న టెస్టుల్లో చెలరేగి ఆడాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస టెస్టుల్లో డబుల్ సెంచరీలు సాధించాడు. 236 బంతులలో జైస్వాల్ 14 ఫోర్లు, 12 సిక్సులతో 214 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇదిలా ఉంటే…. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జైస్వాల్ పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అలిస్టర్ కుక్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరలవుతున్నాయి. తన కెరీర్ మొత్తంలో కొట్టిన సిక్సుల (11) కంటే జైస్వాల్ ఒక ఇన్నింగ్స్ కొట్టిన సిక్సులే ఎక్కువ అని కొనియాడారు. జైస్వాల్ నిన్నటి మ్యాచ్లో 12 సిక్సులు కొట్టడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news