ఒకే ఒక సభ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలకు చెమటలు పట్టించింది.. ఆ ఒక్క సబే.. టిడిపి జనసేన గెలుపు అవకాశాలపై నీళ్లు చల్లింది.. ఎటు చూసినా జన ప్రవాహం రాప్తాడులో కనిపించింది.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిద్ధం సభ రాప్తాడు లో సూపర్ సక్సెస్ అవడంతో వైసిపి శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు.. టిడిపి జనసేన బిజెపి నేతలకి కంటిమీద కునుకు లేకుండా ఉన్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది..
భీమిలి దెందులూరు తర్వాత రాప్తాడును సీఎం జగన్ ఎన్నుకున్నారు.. ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. గతంలో ఈ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు.. వాటిని గత ఎన్నికల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టింది.. ఇప్పుడు మరోసారి అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో.. ఈ మూడు నియోజకవర్గాల్లో వచ్చిన ప్రజల స్పందన తెలుగుదేశం పార్టీకి ముచ్చమటలు పట్టిస్తోంది.. ఈ రాప్తాడు సభతో సీఎం జగన్ మీద రాయలసీమ ప్రజలకు అభిమానం చెక్కుచెదరలేదని.. మరోసారి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రుజువైంది.. ఈ సభకు సుమారు పది లక్షల మంది పార్టీ కార్యకర్తలు హాజరయ్యారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.. వారు ఊహించినట్లుగానే కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు చేరుకోవడం.. జగన్ మాట్లాడుతున్న సమయంలో ఆ ప్రాంగణం జై జగన్ అనే నినాదాలతో హోరెత్తించడం జగన్ పై వారు కొన్న అభిమానానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు..
రాయలసీమ జిల్లాలలో మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే గత ఎన్నికల్లో కేవలం మూడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది.. ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలని భావిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు.. రాప్తాడు సభతో డేంజర్ బెల్స్ మోగినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. రాయలసీమ జిల్లాలలో టిడిపి ఇక తట్టా బుట్ట సర్దుకోవాల్సిందే అని వైఎస్ఆర్సిపి శ్రేణులు సెటైర్లు పేలుస్తున్నారు.. మొత్తంగా రాప్తాడు సభ చరిత్రలో నిలిచిపోయేదిలా ఉందని రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు..