ఒకే సిరీస్ లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన జైస్వాల్..!

-

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు రాజ్‌కోట్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు (ఆదివారం) ఇంగ్లండ్‌పై భారత్ 556 పరుగులకు పైగా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇన్నింగ్స్ డిక్లెర్డ్ చేశారు. ఇంగ్లండ్ పరుగుల లక్ష్యం 557 చేస్తే.. విజయం వరిస్తుంది.

ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నారు. మొదటి మ్యాచ్ నుంచే ఇతర ప్లేయర్లు ఇబ్బంది పడుతుంటే.. ఈ కుర్రాడు మాత్రం డబుల్ సెంచరీలను అలవోకగా.. కొట్టేస్తున్నారు. జైస్వాల్ ఫస్ట్ టెస్ట్ లో ఆఫ్ సెంచరీ, రెండు లేదా మూడు టెస్టుల్లో డబుల్ సెంచరీతో దుమ్ము దులిపేశాడు. వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లీల తరువాత వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించిన మూడో ప్లేయర్ గా జైస్వాల్ నిలిచాడు. మరో వైపు టీమిండియా యువ దిగ్గజం సర్ఫరాజ్ ఖాన్ కూడా వరుసగా హాప్ సెంచరీ చేసి రికార్డు నెలకొల్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news