దుమ్ము రేపుతున్న జేమ్స్ బాండ్‌ కొత్త మూవీ.. నో టైమ్ టు డై.. ట్రైల‌ర్‌..!

-

ప్రముఖ హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెయిగ్ ప్రధాన పాత్రలో జేమ్స్ బాండ్ సిరీస్‌లో తెరకెక్కుతున్న నూతన సినిమా.. నో టైమ్ టు డై.. చిత్ర ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎప్పటిలాగే ఈ మూవీలోనూ జేమ్స్‌బాండ్ తన స్టంట్లతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ట్రైలర్‌లో జేమ్స్‌బాండ్ పలు వాహనాల్లో చేసే ఛేజ్‌లు ప్రేక్షకులను అలరించనున్నాయి. కాగా ఈ ట్రైలర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్‌ను 7 లక్షల మందికి పైగా వీక్షించారు.

జేమ్స్ బాండ్ సిరీస్‌లో ఈ మూవీ 25వది కాగా.. దీనికి కారీ జోజి ఫుకునా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అపహరణకు గురైన ఓ శాస్త్రవేత్తను కాపాడేందుకు జేమ్స్‌బాండ్ ఏం చేశాడనేది ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలిసింది. ఇక ఈ మూవీని 2020 ఏప్రిల్ 2వ తేదీన యూకేలో, ఏప్రిల్ 8న అమెరికాలో, ఇండియాలో విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీకి గ‌తంలో ప‌లు స‌మ‌స్య‌లు వ‌చ్చిన కార‌ణంగా షూటింగ్ కొంత కాలం వాయిదా ప‌డింది. సెట్‌లో న‌టుడు డేనియల్ క్రెయిగ్ గాయ‌ప‌డ‌డంతో షూటింగ్ కొంత కాలం ఆగిపోయింది. ఆ త‌రువాత మ‌రొక‌సారి సెట్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగి ప‌లు వ‌స్తువులు కాలిపోయాయి. దీంతో రెండు సార్లు షూటింగ్‌కు బ్రేక్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం ఇక ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version