మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిదంబరానికి నిన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 106 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన నిన్న తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే చిదంబరం పార్లమెంట్ సమావేశాలకు 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం(నేడు) ఉదయం హాజరయ్యారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయనను మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసింది.
కానీ.. ఐన్‌ఎక్స్ మీడియా కేసులో మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఆయన మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన రాజ్యసభలో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.