రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో
సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళితే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యువ రాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేడంటూ పరోక్షంగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
ఏపీకి సీఎం చంద్రబాబు నాయకత్వం వహించలేరని, పవన్ కళ్యాణ్ ముందుకు రావాలని వైసీపీ ఎంపీ
విజయసాయిరెడ్డి చేసిన ప్రతిపాదనపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ‘74 ఏళ్ల
గాంధీజీ క్విట్ ఇండియాతో యావత్ దేశాన్ని స్వాతంత్య్ర ఉద్యమం వైపు నడపగా లేనిది చంద్రబాబు
ఏపీని లీడ్ చేయలేరా? బుర్ర పెట్టి ఆలోచించండి. ఏపీని ఎవరు పాలించాలో ప్రజలు నిర్ణయిస్తున్నారని
బొలిశెట్టి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.