గ్రేటర్ ఎన్నికలకి సంబంధించి జనసేన పార్టీపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు పార్టీల మధ్య దూరం పెంచే విధంగా ఉన్నాయి. జనసేన తెలంగాణలో తమ పార్టీతో పొత్తు లాంటిది ఏది పెట్టుకోలేదు అని, కేవలం బయట నుంచి పవన్ పార్టీకి మద్దతు ఇస్తుందని అరవింద్ పెర్కొన్నారు. దీంతో ఆయన కామెంట్స్ మీద జనసేన ఫైర్ అయింది. వాటిని ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని జనసేన డిమాండ్ చేసింది.
ఢిల్లీ స్థాయి నేతలు, తెలంగాణ బీజేపీ అగ్రనేతలు కోరడం వల్లే… తెలంగాణలో పోటీని జనసేన విరమించుకొని… బీజేపీకి మద్దతు ఇచ్చిందని జనసేన నేతలు ఫైర్ అయ్యారు. ఎంపీ అరవింద్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. జనసేన పార్టీ ఏ పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిందో మీకు తెలియకపోతే మీ అగ్రనాయకులను అడిగి తెలుసుకోండి. అంతే తప్ప జనసైనికులను రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడటం సరికాదు. మీ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని జనసేన ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేసింది.