జ‌న సంద్రం అదిగో జ‌న‌సేనాని అదిగో ..థాంక్ యూ ఇప్ప‌టం

-

జ‌న‌సంద్రం ఎక్క‌డుంది
ఇప్ప‌టం గ్రామంలో
అమ‌రావ‌తి అనే రాజ‌ధానిలో
మంగ‌ళ‌గిరి అనే నియోజ‌క‌వ‌ర్గంలో
ఆహా! అన్నం పెట్టే రైత‌న్నకు మ‌రో భాగ్యంత‌మ ఊరికి వ‌స్తున్న ప‌వ‌న్ అభిమానుల ఆక‌లి తీర్చ‌డం వారి వంతు. వారి బాధ్య‌త కూడా! నేల త‌ల్లి బిడ్డ‌లు ప‌సుపు కుంకుమ‌లు దిద్ది ప‌వ‌న్ ను ఆహ్వానిస్తున్నారు.నేల త‌ల్లి బిడ్డ‌లు అంద‌రినీ అక్కున చేర్చుకుని అన్న సంత‌ర్ప‌ణ చేస్తున్నారు.
బువ్వ పెట్టి పంపే బాధ్య‌త‌లో ఏ రోజు ఏ రైతు ఓడిపోయాడు క‌నుక! క‌నుక రాజ‌ధాని రైతుకు ఎల్ల‌వేళ‌లా స‌ర్వ శుభాలే క‌ల‌గాలి అన్న‌ది అంద‌రి దీవెన..ఆకాంక్ష కూడా !

ఊరు ఊరంతా ఒక్క ఉత్స‌వం మాదిరి ఉన్నారు.క‌ష్టం సుఖం పంచుకుంటే మ‌న ప‌ల్లెలు భాగ్య సీమ‌లు అవుతాయి. త‌మ క‌ష్టం లోకానికి చెప్పేందుకు వస్తున్న ప‌వ‌న్ కు వారంతా సాద‌రంగా ఆహ్వానిస్తున్నారు. వెయ్యి మంది వ‌లంటీర్లు ఈ స‌భ‌కు ప‌నిచేస్తున్నారు. ఎంద‌రో త‌ల్లులు వేకువ జాము నుంచే అన్నం వండి వార్చి పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. తెలుసు క‌దా స‌ర్ రైతు అంటే అన్నం పెట్టేవాడు.. ఆద‌రించి ప్రేమ పంచే వాడు. స‌ర్ వాడు రైతు..వేషాలు మార్చి తిరిగే నాయ‌కుడు కాదు. ఇక‌పై అయినా వైసీపీ నాయ‌కులు రైతుల‌ను ముఖ్యంగా రాజ‌ధాని రైతుల‌ను ఉద్దేశించి చెడు మాట్లాడ‌డం మానుకుంటే బెట‌ర్.

అన్నం పెట్ట‌డం రాజ‌ధాని రైతు ల‌క్ష‌ణం..అన్నం పెట్టి పంప‌డం అమ‌రావ‌తి రైతుల బాధ్య‌త.. జీవించ‌డం అన్న‌ది ఓ లక్ష‌ణం.. ప్రేమ పూర్వక జీవితం అందించ‌డం అన్న‌ది ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఇప్ప‌టం గ్రామం ఇవాళ ఆద‌ర్శ‌నీయం. ఆహా! ఊరు ఊరంతా క‌లిసి త‌మ ఊరికి వ‌చ్చిన వారి ఆక‌లి తీరుస్తోంది.దాహార్తి తీరుస్తోంది. అన్నం పెట్టి అతిథి ధ‌ర్మం ఒక‌టి చాటుతోంది. ఇర‌వై ఎక‌రాల్లో స‌భ యాభై ఎక‌రాల్లో పార్కింగ్ రెండు ట‌న్నుల పులిహోర నాలుగు ల‌క్ష‌ల వాట‌ర్ ప్యాకెట్లు అందిస్తోంది ఆ గ్రామం.

నేల గ‌ర్వ‌ప‌డిన‌ప్పుడ‌ల్లా పొంగిపోవాలి మ‌నం. ప‌వ‌న్ లాంటి నాయ‌కులు గెలుపు ఓట‌ముల‌ను ప‌ట్టించుకోరు త‌మ‌ను ఆద‌రించి అన్నం పెట్టిన వారినే గుర్తు పెట్టుకుంటారు. థాంక్ యూ ఇప్ప‌టం.

Read more RELATED
Recommended to you

Exit mobile version