ఈ సారి ఎన్నికల్లో తనతో పాటు పోటీ చేసే ప్రతి జనసేన అభ్యర్ధిని అసెంబ్లీలో కూర్చోబెడతా…ఇదే నా మాట అని చెప్పి..ఇటీవల కాలంలో పవన్ పలు పార్టీ సమావేశాల్లో చెప్పారు. అయితే పవన్ తో పాటు ప్రతి జనసేన అభ్యర్ధి గెలవాలంటే ఖచ్చితంగా టిడిపితో పొత్తు ఉండాలి. టిడిపితో పొత్తు ఫిక్స్ చేసుకునే పవన్ ఆ మాట ఇచ్చారు. ఈసారి అసెంబ్లీలో జనసేన అభ్యర్ధులు ఉండాలని, అందుకు పొత్తు తప్పదని చెప్పారు.
అయితే టిడిపితో పొత్తు ఉంటే ఎక్కువ శాతం జనసేన అభ్యర్ధులు గెలవడం పక్కా..అందులో ఎలాంటి డౌట్ లేదు. గత ఎన్నికల్లోనే పొత్తు ఉంటే పవన్ తో సహ పలువురు నేతలు గెలిచేవారు. కానీ ఇప్పుడు పొత్తు ఉంది కాబట్టి డౌట్ లేకుండా గెలుస్తారు. ఇక ఈ సారి జనసేన నేతలు దాదాపు విజయం దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఆ పార్టీలో మొదట గెలుపు ఫిక్స్ అనుకునే నేత పవన్ కల్యాణ్..అందులో డౌట్ లేదు. పొత్తు ఉన్నా లేకపోయినా పవన్ గెలుపు ఖాయం.
ఎలాగో పొత్తు ఉంటుంది కాబట్టి పవన్ భారీ మెజారిటీతో గెలిచేస్తారని సర్వేలు చెబుతున్నాయి. ఆయన భీమవరంలో పోటీ చేస్తారా? ఇంకా ఎక్కడ పోటీ చేసిన గెలవడం ఖాయమే. ఇక పవన్ తర్వాత జనసేనలో గెలుపు పక్కా అనే రెండోనాయకుడు బొమ్మిడి నాయకర్..మామూలుగా రెండోనాయకుడు అంటే నాదెండ్ల మనోహర్ అనుకుంటారు. ఆయన గెలుస్తారేమో గాని..నాయకర్ గెలుపు పక్కా అని సర్వేలు చెబుతున్నాయి.
గత ఎన్నికల్లో జనసేన కేవలం ఒక స్థానంలో గెలవగా, మూడు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. గెలిచిన స్థానం రాజోలు…ఇక రెండో స్థానంలో ఉన్నవి భీమవరం, గాజువాక, నరసాపురం..అందులో భీమవరం, గాజువాక స్థానాల్లో పవన్ పోటీ చేశారు. ఇక నరసాపురంలో నాయకర్ పోటీ చేసి వైసీపీపై కేవలం 6 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ టిడిపికి మూడో స్థానం. 27 వేల ఓట్లు వచ్చాయి. ఈ సారి పొత్తులో భాగంగా నరసాపురం జనసేనకు దక్కడం ఖాయం..అక్కడ నాయకర్ డౌట్ లేకుండా గెలవడం ఖాయమని జనసేన శ్రేణులు అంటున్నాయి.