తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డును సృష్టించింది – ఎమ్మెల్సీ కవిత

-

స్వతంత్ర భారతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా సంక్షేమంలో బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జరుపుకుంటున్న మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళ లోకానికి కవిత శుభాకాంక్షలు తెలిపారు.

కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. గత తొమ్మిదేళ్లలో 13,90,636 మంది బాలింతలకు కేటీఆర్ కిట్ ద్వారా లబ్ధి పొందాలని అన్నారు. 6.84 లక్షల మంది గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు 18,46, 635 మంది మహిళలకు అమ్మ ఒడి పథకం అందించారన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version