“బీమ్లా నాయక్” విడుదల అయ్యే వరకు టికెట్ల ధరలు పెంచబోరని…జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జి కిరణ్ రాయల్ అన్నారు. ఉద్యోగుల విషయంలో సమస్య ప్రభుత్వమే సృష్టించింది, దాన్ని పరిష్కరించేది ఆ నలుగురు ప్రభుత్వ పెద్దలేనని మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ ఈ రెండు రాష్ట్రాల ప్రజల దత్త పుత్రుడు, వైసిపి నాయకులకు కాదని.. కేంద్ర బడ్జెట్ లో ఏపి కి రావాల్సిన నిధులను సాధించుకునేందుకు వైసిపి ఎంపీ లు విఫలమయ్యారని నిప్పులు చెరిగారు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడితే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తారని.. సినీ స్టార్స్ నీ జగన్ రెడ్డి చూడలనుకొని పిలిపించుకున్నరు, రాష్ట్ర ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ప్రభుత్వం టికెట్ల అమ్ముకుంటున్నారని ఆగ్రహించారు.
మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఉండి, నటీనటుల సమస్యలపై ఏ రోజు మాట్లాడలేదని.. టికెట్ల వ్యవహారంపై తన భావ జగన్ దగ్గర మంచు విష్ణు ఎందుకు మాట్లాడడం లేదని నిప్పులు చెరిగారు. వైజాగ్ లో సినీ ఇండస్ట్రీ ఏమైంది, ఆ మాటలు ఒట్టి భుటకాలేనని.. మెగా స్టార్ కి మెంటల్ స్టార్ కి తేడా లేదా, పోసాని కృష్ణమురళి తో చిరంజీవి నీ పోల్చడం మంచిది కాదని మండిపడ్డారు.