అసలు సినిమాలే వద్దని అమ్మ చెప్పింది – జాన్వీ కపూర్

-

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన జాన్వీ కపూర్‌… అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకుంది. జాన్వీ కపూర్‌ తన తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించింది. `దడక్‌` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు.

ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘సైరాత్‌’కు రీమేక్‌గా వచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా జాన్వీ కపూర్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. చిత్ర పరిశ్రమంలోకి వస్తానంటే ఆ అమ్మ మొదట్లో వద్దని చెప్పింది. ఇక్కడ అనుకున్నంత ఈజీగా ఏదీ ఉండదని పేర్కొంది. నెగ్గుకు రావాలంటే కఠినంగా ఉండాలని అలా నేను ఉండ లేనని చెప్పింది. కానీ ఏది ఏమైనా నేనున్నటిగా కొనసాగాలని అనుకుంటున్నాను అని తేల్చి చెప్పడంతో అమ్మ ఒప్పుకోంది అని పేర్కొంది జాన్వీ కపూర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version