జనవరి 12 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

మార్గశిరమాసం – జనవరి 12-  మంగళవారం.

మేషరాశి: కార్యసిద్ధి కలుగుతుంది !

ఈ రోజంతా బాగుంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. ఈరోజు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. ఈరోజు వివాహాది విషయాలకు సంబంధించి అనుకూలమైన రోజు. ఈరోజు ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశం. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు వ్యాపారంలో లాభాలు పొందుతారు.

పరిహారాలుః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

todays horoscope

వృషభ రాశి: ఆర్ధిక ఇబ్బందులు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఈరోజు ఉద్యోగం లో పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. తొందరగా ఎవ్వరిని నమ్మకుండా ఉండడం మంచిది.

పరిహారాలుః ఈరోజు శ్రీ శివ పార్వతి అష్టోత్తర సహస్ర నామం చదువుకోండి.

 

మిథున రాశి: కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు !

ఈ రోజంతా బాగుంటుంది. అనారోగ్యంతో తగ్గిపోయి తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. అప్పుల బాధలు తీరి పోయి లాభం కలుగుతుంది. ఈరోజు వివాహాది సంబంధ విషయాలు చర్చలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా సంతోషంగా ఉంటారు. ఈరోజు గృహ స్థలాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కర్కాటకరాశి: వ్యాపార లాభాలు కలుగుతాయి !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. ఈరోజు మీ వాక్చాతుర్యం వల్ల అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు. ఈరోజు అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటారు. ధన ప్రాప్తి. వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం. ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకోవడం వల్ల లాభాలు కలుగుతాయి. సమాజంలో పేరుప్రఖ్యాతులు పొందుతారు.

పరిహారాలుః శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి: కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పనిలో కంగారు పడకుండా నెమ్మదిగా చేసుకుంటే మంచిది. ఈ రోజు ముఖ్యమైన విషయాల్లో అంటే వివాహ సంబంధ విషయాల్లో తక్కువగా మాట్లాడడం మంచిది. ఈరోజు పిల్లల విషయంలో జాగ్రత్త పడటం మంచిది. ఈరోజు ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతుంది. ఈరోజు భార్యాభర్తల్లో పక్కవారి మాటలు వినకుండా అన్యోన్యంగా ఉండడం మంచిది. ఈరోజు విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధ పెట్టడం మంచిది.

పరిహారాలుః  శ్రీహనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, ఆంజనేయస్వామి  దేవాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల శుభం కలుగుతుంది.

 

కన్యారాశి: వ్యాపారస్తులకు నష్టం !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. ఈరోజు ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ప్రమాదాలు జరుగే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు బాగా శ్రమించాల్సిన పరిస్తితి ఉంది. విలువైన వస్తువులను, డబ్బును జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మంచిది కాదు, మోసపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు గురు దత్తాత్రేయ పారాయణం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

తులారాశి: అనుకున్న పనులు నెరవేరుతాయి !

ఈ రోజు సానూకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. వ్యాపారం, వృత్తుల వారికి లాభాలు వస్తాయి. ఈరోజు ఉద్యోగంలో కోరుకున్నచోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు బంధుమిత్రుల రాకతో ఆనందం. శుభకార్య చర్చలకు అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృశ్చికరాశి: అప్పుల బాధలు తీరిపోతాయి !

ఈ రోజు అద్భుతంగా ఉంటంది. మీ మాటల వల్ల అందరిని ఆకర్షిస్తారు.  అప్పుల బాధలు తీరిపోతాయి. అదేవిధంగా మొండి బకాయిలు వసూలు చేసుకోంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఈరోజు విలువైన వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షల్లో  ఉన్నత శ్రేణి మార్కులను పొందుతారు. కొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది.

పరిహారాలుః శ్రీ వేంకటేశ్వర గోవింద నామాలు పారాయణం చేసుకోండి.

 

ధనస్సురాశి: ధన లాభం పొందుతారు !

ఈ రోజు గ్రహచలనం రీత్యా అనుకూలంగా ఉంటుంది. అప్పుల బాధలు తీరిపోయి ఖర్చులను తగ్గించుకుంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి, ధన లాభం పొందుతారు. ఇంట్లో శుభకార్యాన్ని తలపెడతారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకున్న స్థానాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు పొందుతారు. అన్నదమ్ములు కలిసి మెలిసి ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పరిహారాలుః శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి: ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు !

ఈ రోజంతా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అప్పు తీసుకోవడం, ఇవ్వడం మంచిది కాదు. ధననష్టం కలుగుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడం మంచిది.

పరిహారాలుః శ్రీదుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

కుంభరాశి: సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

అనుకూలమైన రోజు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం వల్ల ధన ప్రాప్తి.  బంధువులతో, కుటుంబ సభ్యులతో సరదాగా సంతోషంగా, సఖ్యతగా ఉంటారు, సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారంలో లాభాలు. తీర్థయాత్రలు చేస్తారు.

పరిహారాలుః భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

 

మీనరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

మంచిరోజుల్లో ఇది ఒకటి. గతంలో కోల్పొయిన ఉద్యోగం తిరిగి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. గృహ స్థలాలను కొనుగోలు చేస్తారు, అప్పుల బాధలు తీరిపోతాయి. కొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టడం వల్ల వ్యాపార లాభాలు పొందుతారు. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పరచుకుంటారు. ప్రయాణ లాభాలు.

పరిహారాలుః శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి. శుభ ఫలితాలు వస్తాయి.

 

-శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version