ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే రోజంతా తాజాగా ఉంటుంది..

-

ఉదయం పూట నిద్రలేవగానే మీరు చేసే పనులు ఆ రోజుని ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తాయి. పొద్దు పొద్దున్నే చికాగ్గా ఉన్నారనుకోండి. ఆ రోజు మొత్తం చికాగ్గానే ఉంటుంది. పొద్దున్న పూట చిరాకు పడితే అంత త్వరగా తగ్గదు. తాజాగా నిద్రలేచి, కోపం తెచ్చుకోకూడదని అందుకే చెబుతారు. ఐతే పొద్దున్న పూట ఏం చేస్తే ఫ్రెష్ గా ఉంటుందో ఇక్కడ చూద్దాం.

రాత్రిపూట నిద్రపోయే ముందు రేపేం చేయాలనేది ముందే డిసైడ్ అవ్వండి. నిద్ర లేచిన గంట వరకు ఏం చేయాలనేది ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే, ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకున్నారు ఒక క్రమ పద్దతిలో రోజుని మొదలెడతారు.

పది నిమిషాలు ఆగి నిద్రలేస్తానని చెప్పి మళ్ళీ పడుకోవద్దు. అలా చేయడం వల్ల దీర్ఘకాలంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

నీళ్ళు తాగాలి..

రాత్రంతా నిద్రపోతారు కాబట్టి, కడుపులో అసలేమీ ఉండదు. అందువల్ల శరీరానికి నీళ్ళు అందవు. కాబట్టి పొద్దున్న లేవగానే, నీళ్ళు తాగాలి. నీళ్ళలో నిమ్మ రసం, తేనె కలుపుకుంటే మరింత మంచిది.

ధ్యానం

రోజంతా ఫ్రెష్ గా ఉండడానికి కనీసం పదిహేను నిమిషాలైనా నిశ్శబ్దంగా కూర్చోవాలి. ధ్యానం చేయడం మీకు తెలియకపోతే నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోండి. నిశ్శబ్దం మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఆ టైమ్ లో మీ మెదడు సాధారణం కంటే ఎక్కువ పదునుగా పనిచేస్తుంది.

వ్యాయామం

కనీసం అరగంటైనా వ్యాయామం చేస్తే మంచిది. నిద్రలో బిగుసుకుపోయిన మీ శరీర కణాలకు కొత్త ఎనర్జీని తీసుకువచ్చి, రోజంతా పనిచేయడానికి కావాల్సిన చురుకుదనాన్ని వ్యాయామం తీసుకువస్తుంది.

ఎండలో నిలబడడం

సూర్యుని నుండి వచ్చే కిరణాల్లో విటమిన్ డి ఉంటుంది. అది ఎముకలకి బలాన్ని చేకూరుస్తుంది. అంతే కాదు పొద్దున్నే సూర్యుని కిరణాలు శరీరంపై పడితే కొత్త ఉత్తేజం వస్తుంది. మనలో ఉత్సాహం నింపుకోవడానికి ఎండలో నిలబడడం బెటర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version