జనవరి 30 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ జనవరి – 30- పుష్యమాసం- శనివారం.

 

మేష రాశి:ఆభరణాలు కొనుగోలు చేస్తారు !

ఈరోజు శుభకరంగా ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. మొండి బాకీలు వసూలు అవుతాయి. అనవసర ఖర్చులు దూరంగా ఉండండి. ఈరోజు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. వ్యాపారాలను విస్తరించడం వలన ధన లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః  శ్రీకనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:ఈరోజు ఉద్యోగులకు పదోన్నతులు !

ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగాలకు అర్హులు అవుతారు. వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఆఫీసులలో పదోన్నతులు పొందుతారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. సోదరులతో కలిసిమెలిసి ఉంటారు. ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువగా ఉంటుంది.

పరిహారాలుః  ఈరోజు శ్రీ అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:ఈరోజు మొండి బాకీలు వసూలు !

ఈరోజు బాగుంటుంది. ఆరోగ్య విషయంలో బాగుంటారు. శత్రువులు స్నేహితులు అవతారు. మిత్ర లాభం పొందుతారు. అప్పుల బాధ నుంచి బయట పడతారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. ధన లాభం పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. వ్యాపార లాభాలు పొందుతారు.

పరిహారాలుః  శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:పై అధికారుల వల ఇబ్బందులు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సోదరులతో సఖ్యతగా ఉండడం మంచిది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది, ఇబ్బందులు కలుగుతాయి. కోపాలకు దూరంగా ఉండటం మంచిది లేదంటే నష్టపోతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల వల ఇబ్బందులు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది, నష్టం జరిగే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లండి.

 

సింహరాశి:తీర్ధ యాత్రలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. శత్రువులు కూడా స్నేహితులవుతారు. శత్రు నాశనం పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. తీర్ధ యాత్రలు చేస్తారు. గృహంలో ఒక శుభకార్యం చేయాలని తలపెడతారు. ఉద్యోగస్తులు ఆఫీసులలో పదోన్నతి పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః  శ్రీగణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 కన్యారాశి:ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి !

ఈరోజు కష్టంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆదాయం తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. స్త్రీలు ఒక్కరే ప్రయాణం చేయకుండా ఉండటం మంచిది లేదంటే ఇబ్బంది కలిగే  ఉంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు శ్రీవేంకటేరశ్వర స్వామి ఆరాధన చేయండి.

 

తులారాశి:ఈరోజు బాగా చదువుకుంటారు !

ఈరోజు ఆనంద యోగంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరితో కలిసి మెలిసి ఉంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఆత్మీయ కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు. ఇంతకుముందు పోగొట్టుకున్న ఉద్యమం తిరిగి పొందుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీనివాస గోవిందనామాలు చదవుకోండి లేదా గద్యం పారాయణ చేసుకోండి.

 

వృశ్చిక రాశి:కార్యసిద్ధి పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. అనుకున్న పనులు సరైన సమయంలో పూర్తిచేసి కార్యసిద్ధి పొందుతారు. కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం కలిగే అవకాశం ఉంది. అన్నదమ్ములతో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు వేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి:ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యాన్ని పొందుతారు. మాట తీరు వల్ల అందరు మిమ్మల్ని ఆదరిస్తారు. వ్యాపార భాగస్వాముల వలన  లాభాలు పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వాహన కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:శత్రువులు పెరిగే అవకాశం ఉంది !

ఈరోజు అనుకూలంగా లేదు. సోదరులతో సఖ్యతగా ఉండడం మంచిది, విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. భార్యాభర్తల సఖ్యతగా ఉండడం మంచిది. శత్రువులు పెరిగే అవకాశం ఉంది. తక్కువ మాట్లాడడం మంచిది. ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

పరిహారాలుః ఈరోజు శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:నిరుద్యోగులకు ఉద్యోగ లాభం !

ఈరోజు బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. స్థిరాస్తులు సంక్రమించే అవకాశం ఉంది. వ్యాపారాలను విస్తరించుకొని లాభాలు పొందుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ వేంకటేశ్వర గోవింద నామాలు పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:శత్రువులు మిత్రులు అవుతారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. చేపట్టిన పనులు సరైన సమయంలో పూర్తి చేస్తారు. కార్యసిద్ధి పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. క్రొత్త వ్యాపారాలు ప్రారంభించి అధిక లాభాలు పొందుతారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు.

పరిహారాలుః హనుమాన్‌ చాలీసా పారాయణం చేసుకోండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news