వామ్మో.. తేనెటీగ‌లను చేతికి అంటిపెట్టుకుని వెళ్లాడు.. వైర‌ల్ వీడియో..!

-

సాధార‌ణంగా ఎవరినైనా స‌రే ఒక తేనెటీగ‌ కుడితేనే విప‌రీత‌మైన బాధ క‌లుగుతుంది. తేనెటీగ కుట్టిన చోట విప‌రీత‌మైన నొప్పి, మంట క‌లుగుతాయి. అయితే కొంద‌రు మాత్రం తేనెటీగ‌ల‌ను శ‌రీరానికి అంటి పెట్టుకుని తిరుగుతుంటారు. ఆశ్చ‌ర్యంగా అలాంటి వ్య‌క్తుల‌కు ఏమీ కాదు. ఇక ఇలాగే ఓ యువ‌కుడు కూడా తేనెటీగ‌లను త‌న చేతికి అంటి పెట్టుకుని వెళ్లాడు. అయినా అత‌నికి ఏమీ కాలేదు.

man carried entire bees colony on his hands

ఓ యువ‌కుడు భారీ సంఖ్య‌లో తేనెటీగ‌ల‌ను త‌న చేతికి అంటి పెట్టుకుని వెళ్తుండ‌గా ఓ వ్య‌క్తి అత‌న్ని వీడియో తీశాడు. అయితే అత‌ను ఆ తేనెటీగ‌ల‌ను బాక్సులో పెట్టేందుకు వెళ్తున్నాన‌ని, తాను ఒక తేనెటీగ‌ల ఫాంలో ప‌నిచేస్తానని తెలిపాడు. అయితే నిన్ను తేనెటీగ‌లు కుట్ట‌వా అని అడిగితే నేను వాటికి ఓన‌ర్‌ను అని వాటికి తెలుసు.. అందుకే కుట్ట‌వు అని స‌మాధానం ఇచ్చాడు.

కాగా వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. అన్ని తేనెటీగ‌లు చేతికి చుట్టుకుని ఉన్నా ఏమీ కాక‌పోవ‌డంతో నెటిజన్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అవును మ‌రి.. కొంద‌రికి ఇలాగే జ‌రుగుతుంది. కానీ సాధార‌ణంగా ఎవ‌రికైనా స‌రే తేనెటీగ‌లు కుడితే అత్యంత విప‌రీత‌మైన నొప్పి క‌లుగుతుంది. కానీ వీడియోలో ఉన్న అత‌న్ని చూసి మీరు కూడా అత‌నిలా ఫీట్లు చేయ‌కండి. సీన్ రివ‌ర్స్ అయితే ప్రాణాల‌కు ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news