ఈ సెలవుల గురించి తెలుసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. లేదంటే మీరు పూర్తి చేసుకోవాలని అనుకునే ముఖ్యమైన పనులు పూర్తి కావు. కనుక ముందే సెలవుల గురించి చూసుకోండి. జనవరి నెల చివరన సెలవులు వచ్చాయి. వీటిని ముందే చూసుకుంటే మీరు మీ బ్యాంకులు పూర్తి చేసుకోవడానికి ప్లాన్ చెయ్యచ్చు.
అయితే మరి ఈ నెల ఆఖరున ఏయే రోజులు సెలవు..?, ఎందుకు బ్యాంకులు పని చెయ్యవు అనే ముఖ్య విషయాలని మనం చూసేద్దాం. జనవరి 26 నుంచి 31 మధ్య బ్యాంకులకు సెలవులు వచ్చాయి.
జనవరి 30-31 తేదీల్లో అఖిల భారత బ్యాంకు సమ్మెకు పిలుపు ఇచ్చారట. వాణిజ్య బ్యాంకుల్లో పని చేస్తున్న మొత్తం తొమ్మిది మంది అధికారులు ఉద్యోగుల సంఘం సంయుక్త ఫోరమ్ (యుఎఫ్‌బియు) పిలుపు మేరకు అన్ని బ్యాంకుల వారు సమ్మె లో పాల్గోనున్నారు.
ఒకవేళ కనుక సమ్మె ఉంటే ఆ రెండు రోజులు బ్యాంకులు పని చెయ్యవు. అలానే జనవరి 26న రిపబ్లిక్ డే. కనుక ఎలానో సెలవే. జనవరి 27న కేవలం ఒక రోజు మాత్రమే బ్యాంకులు ఓపెన్ చేసి ఉంటాయి. కనుక ఏమైనా పనులు ఉంటే ఆ రోజు మీరు ప్లాన్ చేసుకో వచ్చు.
జనవరి 26: రిపబ్లిక్ డే
జనవరి 27: నాలుగో శనివారం
జనవరి 29: ఆదివారం
జనవరి 30, 31: అఖిల భారత బ్యాంకుల సమ్మె