జస్ప్రిత్ బూమ్రా, హర్షల్ పటేల్ లు గాయాలతో ఆసియా కప్ కు దూరమైన సంగతి తెలిసిందే. బూమ్రా వెన్ను నొప్పితో బాధపడుతుంటే, హర్షల్ పటేల్ పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో పాల్గొంటున్నారు. తాజాగా నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో వీరిద్దరూ పాస్ అయినట్లు వార్తలు అందుతున్నాయి. అన్ని సవ్యంగా జరిగితే ఆస్ట్రేలియాతో ఈనెల 24 సిరీస్ కు బూమ్రా, హర్షల్ పటేల్ లు అందుబాటులో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది.
టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ జట్టులో ఆ బౌలర్లు
-