టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. స్వామి వారి సేవ చేసే భాగ్యం దక్కడంతో చాలా సంతోషంగా వుంది అని ఆయన సంతోషం వ్యక్తం చేసారు. ఇది చాలా అరుదైన అవకాశం అని అన్నారు. ఎంతో పుణ్యం చేస్తే కానీ ఈ అవకాశం దక్కదు అని పేర్కొన్నారు. చాలా ఏళ్ళుగా స్వామి వారి సేవ చేసేందుకు ప్రయత్నించా అని ఆయన చెప్పుకొచ్చారు.
దేవుడు ఇప్పుడు నాకు ఈ అవకాశం కల్పించాడు అని అన్నారు. నా వైద్య విద్యాభ్యాసం జరిగిన తిరుపతిలోనే నాకు స్వామి వారి సేవ చేసుకునే భాగ్యం దక్కడం చాలా సంతోషంగా వుంది అని పేర్కొన్నారు. భక్తులకు మరెన్ని సౌకర్యాల కల్పనకు కృషి చేస్తాను అని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. అనీల్ సింఘాల్ తర్వాత ఆయనను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.