అల్లు అరవింద్ తల్లి కళ్లు దానం చేసినట్లు.. ప్రకటించారు చిరంజీవి. గతంలో కళ్ల దానం గురించి అత్తయ్యను అడిగితే ఇస్తానన్నారు అని గుర్తు చేసారు చిరంజీవి. నిన్న అరవింద్ కు ఈ విషయం చెప్పగానే కనకరత్నమ్మ కళ్లు దానం చేసేందుకు సరే అన్నారు… ఆమె కళ్లను నేను ఆసుపత్రికి అప్పగించాను అని పేర్కొన్నారు చిరంజీవి.

కాగా సినీ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య భార్య కనకరత్నం (94) నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ కుటుంబ సభ్యులకు సినీ నటీమణులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. అనంతరం కనకరత్నం అంత్యక్రియలలో సినీ నటీమణులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. అందులో భాగంగా చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు అయాన్ కలిసి అంత్యక్రియలలో పాల్గొని కనక రత్నం పాడెను మోసారు.
అల్లు అరవింద్ తల్లి కళ్లు దానం.. ప్రకటించిన చిరంజీవి
గతంలో కళ్ల దానం గురించి అత్తయ్యను అడిగితే ఇస్తానన్నారు: చిరంజీవి
నిన్న అరవింద్ కు ఈ విషయం చెప్పగానే కనకరత్నమ్మ కళ్లు దానం చేసేందుకు సరే అన్నారు
ఆమె కళ్లను నేను ఆసుపత్రికి అప్పగించాను
– చిరంజీవి pic.twitter.com/6HYDpWjaQz
— BIG TV Breaking News (@bigtvtelugu) August 31, 2025