రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష..!

-

దేశవ్యాప్తంగా ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక పరీక్ష సంబంధించి పరీక్ష కేంద్రాల కేటాయింపు పూర్తయిందని దిల్లీ ఐఐటీ వెల్లడించింది. ఇక ఫీజు చెల్లించిన విద్యార్థుల్లో 97.94 శాతం మందికి దరఖాస్తులో నమోదు చేసిన మొదటి మూడు ప్రాధాన్య నగరాల నుంచే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్లు ఐఐటీ ఢిల్లీ ప్రకటన జారీ చేసింది. మిగిలిన 2 శాతం విద్యార్థులకు వారు ఎంచుకున్న 8 ప్రాధాన్య నగరాల నుంచి పరీక్ష కేంద్రాలను కేటాయించామని వివరించారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు ప్రక్రియను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో చేపట్టామని తెలిపారు.

jee

ఇక కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షకు హాజరు కావాలని విద్యార్థులకు తెలియజేశారు. ఇక పరీక్ష కేంద్రం చిరునామా తెలిసినా పరీక్ష రాసే గది కోసం అంత గుంపులుగా ఉండాల్సి వస్తుంది. అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కొత్త విధానాన్ని అమలు చేయబోతునట్లు తెలిపారు. కాకపోతే హాల్‌టిక్కెట్‌పై ఉన్న బార్‌కోడ్‌ను స్కానింగ్‌ చేయాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రంలోకి నేరుగా వెళ్లిన తర్వాత సిబ్బంది హాల్‌టిక్కెట్‌ ను స్కానింగ్‌ చేసి మీకు కేటాయించిన కంప్యూటర్‌ ఏ ల్యాబ్‌లో ఉందో తెలియజేస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version