మునుగోడులో రంగంలోకి జీవిత రాజశేఖర్ !

-

నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. తాజాగా మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

ఈ క్రమంలో చావో, రేవో అన్నట్లుగా మునుగోడు ఉప ఎన్నికను భావిస్తున్న బిజెపి ఇతర పార్టీలకంటే ఎక్కువగా ప్రచారంలోకి చొచ్చుకెల్లాలని చూస్తోంది. అందులో భాగంగా టాలీవుడ్ నుంచి బిజెపిలో కొనసాగుతున్న జీవిత రాజశేఖర్ ను ప్రచారంలోకి దింపేందుకు కాషాయదళం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మునుగోడులో ప్రచారం చేయాలని జీవిత రాజశేఖర్ ను బిజెపి నేతలు కోరగా, దానికి ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో జీవిత రాజశేఖర్ మునుగోడులో ప్రచారం చేస్తారని బిజెపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ భార్యతో కలిసి జీవిత రాజశేఖర్ ప్రచారం చేయనున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version