తెలుగు సినిమా పరిశ్రమ లో కృష్ణ, విజయ నిర్మల లాగా యాంగ్రీ హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత కూడా ఎప్పుడూ కలిసి కార్యక్రమాలకు హాజరు అవుతూ ఉంటారు. ఇక చాలా సార్లు రాజ శేఖర్ వ్యాఖ్యల వల్ల ప్రాబ్లెమ్ వస్తుందని తెలిసి ఎప్పుడూ ఆయన వెన్నంటి ఉండే జీవిత ఆయనకు మంచి సపోర్ట్ ఇస్తుంది. ప్రస్తుతం చాలా వరకు సినిమాలు తగ్గించుకున్న వీరు కుమార్తెల కెరియర్ ను బాగుచేసే పనిలో ఉన్నారు.
ప్రస్తుతం వారి వారసత్వం అందిపుచ్చుకున్న కుమార్తెలు శివాని, శివాత్మిక హీరోయిన్లుగా రాణిస్తున్నారు.తమ కుమార్తెలు నటీమణులు కావడంపై జీవిత ఓ మీడియా సమావేశంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. హర్ష పులిపాక దర్శకత్వంలో తెరకెక్కిన పంచతంత్రం చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రహ్మానందం, స్వాతిరెడ్డి , రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. జీవిత రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక రాజశేఖర్ కూడా కీలక పాత్రలో నటించింది
ఈ సందర్బంగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు జీవిత.మా పిల్లలు పెద్దయ్యాక మేము కూడా యాక్ట్ చేస్తాం అని చెప్పారు. అప్పుడు నేను, రాజశేఖర్ అందరి తల్లిదండ్రుల లాగే చిన్న టెన్షన్ కి గురయ్యాం. సినిమాల్లో రాణించడం అంత సులభం కాదు.చిన్నప్పటి నుంచి మా పిల్లల కోసం ఎంతో కష్టపడ్డాం. వాళ్ళ కోసం ఆస్తులు అమ్ముకున్నాం. వారు ఏది అడిగితే అది చేశాం. కానీ సినిమాల్లో రాణించాలంటే మంచి పాత్రలు రావాలి. వాటిని వాళ్ళే సాధించుకోవాలి. మనం ఎంత సపోర్ట్ చేసినా వాళ్ళలో స్టఫ్ ఉంటేనే కెరియర్ లో ఎదుగుతారు అని చెప్పుకొచ్చింది.