తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తా – జీవిత రాజశేఖర్

-

యాదాద్రి మోత్కూర్ మండలం పొడిచెడు గ్రామం వద్ద బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో సినీ నటి జీవితా రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ… పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుండి అయినా పోటీ చేస్తానని స్పష్టం చేశారుజీవితా రాజశేఖర్.

కొన్నాళ్ళు గా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ కి దూరంగా ఉన్న, ఇప్పుడు పార్టీ కోసం క్రియాశీలకంగా పని చేయడానికి సిద్డంగా ఉన్నానని..మోడీ పాలన దేశానికి శ్రీరామ రక్ష , పార్టీ ఎలాంటి పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.తెలంగాణ లో ఆడవాళ్లకు రక్షణ కావలంటే బీజేపీ పాలన రావాలి, మోడీ బారతదేశాన్ని కాపాడగలరనే విశ్వాసంతోనే మొదటి నుండి బిజెపి కి సపోర్ట్ చేస్తున్నాను అని తెలిపారు టీఆరెస్ ప్రభుత్వ తీరుపట్ల తెలంగాణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.. తెలంగాణ అన్ని రంగాల్లో వెనకబడి ఉందని..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తానని పేర్కొన్నారు జీవిత రాజశేఖర్

Read more RELATED
Recommended to you

Exit mobile version