మన ముఖము అందంగా కనపడాలి అంటే చిరునవ్వుతో నవ్వుతుండాలి. అలా నవ్వినప్పుడు మన దంతాలు చూడడానికి చక్కగా ఆరోగ్యంగా ఉంటేనే అందంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు దృష్ట్యా చాలా మంది దంతాలు పచ్చగా గారపట్టి అంద విహీనంగా కనపడుతున్నారని బాధపడుతుంటారు. చాలా మంది తమ ఆత్మ విశ్వాసంను కూడా కోల్పోతుంటారు. అలాంటి వారు చిన్న చిన్న ఇంటి చిట్కాలను వాడి అందమైన నవ్వును సొంతం చేసుకోవచ్చు.అలాంటి దంత సమస్యలకు ఉపశమనం కలిగించే చిట్కాలెంటో ఇప్పుడు చూద్దాం.
దంతాలు ఎక్కువగా పచ్చగా, గారగా వున్నప్పుడు ముందుగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని శుభ్రంగా కడిగి మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి మెత్తగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ అల్లం మిశ్రమంలో కొంచెం ఉప్పును, రెండు స్పూన్ ల నిమ్మరసాన్ని తీసుకోని ఒక మిశ్రమం లా తయారుచేసుకోవాలి.దీనిని రోజూ ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని బ్రష్ మీద వేసి దంతాలపై 5నిముషాల పాటు బాగా బ్రష్ చేసి తరువాత శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల దంతాలపై ఉండే ఎంతటి గారైనా ఇట్టే తొలగిపోతుంది. దీంతోపాటు ఇతర దంత సమస్యలు , చిగుళ్ల సమస్యలకి కూడా ఉపశమనం కలుగుతుంది. దంతాలు ఎక్కువ పచ్చగా ఉన్నవారు ఈ చిట్కాను ఉదయం, రాత్రి బ్రష్ చేయాలి.తక్కువగా గార పట్టి ఉంటే ఉదయం లేదా సాయంత్రం ఏదో ఒకసారి పాటిస్తే చక్కటి ఉపశమనం కలుగుతుంది.ఈ చిట్కాలో ఉపయోగించే అల్లం, నిమ్మరసం, ఉప్పు దంతాలను తెల్లగా మార్చే గుణాలు పుష్కళంగా ఉన్నాయి. అలాగే ఒక టీ స్ఫూన్ వీనిగర్ కి సోడా ఉప్పు కలిపి,ఈ మిశ్రమంతో రోజూ మార్చి రోజూ బ్రష్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఈ విధంగా ఈ చిన్న చిట్కాలను ఉపయోగించి చాలా తక్కువబడ్జెట్ లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా దంతాలను మల్లె పువ్వులా తెల్లగా , ఆరోగ్యంగా మార్చుకుని..అందమైన చిరునవ్వును మనం సొంతం చేసుకోవచ్చు.