భారత్ లో 26/11 దాడి కంటే పెద్ద ఎటాక్ కి ప్లాన్..?

-

26/11 ఉగ్రవాద దాడి వార్షికోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు మరోసారి పెద్ద దాడి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిక చేశాయి. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. నిన్న  జమ్మూ-కాశ్మీర్ లో జరిగిన నాగ్రోటా ఎన్‌ కౌంటర్‌ పై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ కార్యదర్శి, ఉన్నత నిఘా సంస్థల అధిపతులతో ఈ సమీక్షా సమావేశం జరుగుతోంది.

26/11 ముంబై ఉగ్రవాద దాడి వార్షికోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు “ఏదో పెద్దది” ప్లాన్ చేస్తున్నారని నిఘా  వర్గాలు తెలిపాయి. నిన్న  పాకిస్తాన్ నుంచి చొరబడిన ఉగ్రవాదులతో ప్రయాణిస్తున్న ట్రక్కును అడ్డుకోవడంతో నగ్రోటాలో గురువారం జరిగిన కాల్పుల్లో నలుగురు జైష్-ఇ-మహ్మద్ ఉగ్రవాదులు మరణించారు మరియు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. జమ్మూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్, ఈ ఎన్ కౌంటర్ తర్వాత ఈ ఉగ్రవాదులు “పెద్ద ప్రణాళిక” ను అమలు చేయడానికి వచ్చారని, అది ఇప్పుడు విఫలమైందని అన్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news