వాలంటీర్లకు వచ్చే ప్రభుత్వంలోనూ ఉద్యోగావకాశాలు…!

-

 

నిజమైన ప్రజాసేవకులైన వాలంటీర్లకు రానున్న ప్రభుత్వంలోనూ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందేనని రఘురామకృష్ణ రాజు గుర్తు చేశారు. వాలంటీర్లకు వైకాపా ప్రభుత్వం వలవేస్తోందని, వారిని 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో సన్మానించాలని నిర్ణయించారని, ఆడ వాలంటీర్ అయితే చీరలు, మగవారికి కొత్త బట్టలు కుట్టించి శాలువా కప్పి ఎమ్మెల్యేలు సత్కరించనున్నట్లు తెలుస్తోందని, 5000 రూపాయలకే దారుణమైన దరిద్రమైన సేవలు అందిస్తున్న వారిని గుర్తించి సన్మానించనున్నారట అని తెలిపారు.

వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోవడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు వాలంటీర్ల ముసుగు తొలగించి పార్టీ కార్యక్రమాలకు వారిని వైకాపా నాయకత్వం వినియోగించుకోనున్నట్లు తెలిసిందన్నారు. ఈ రెండు నెలల పాటు పెన్షన్లు ఎవరు ఇస్తారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు… ఏమైనా జరగవచ్చునని, పెన్షన్లు ఇవ్వకపోవచ్చునని, సచివాలయ సిబ్బంది ఇచ్చే అవకాశం ఉందని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఎవరైతే ఎమ్మెల్యేలు చేసే సన్మానంలో పాల్గొంటారో వారి పేర్లను గుర్తించి, రానున్న ప్రభుత్వంలో ఉద్యోగంలో నుంచి తొలగించడం జరుగుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news