రూ. 60 వేల కోట్ల అప్పులు చేయబోతున్న రేవంత్ సర్కారు ?

-

రూ. 60 వేల కోట్ల అప్పులు చేయబోతుంది రేవంత్ సర్కారు. తెలంగాణ బడ్జెట్ లో ఇదే విషయాన్నీ స్పష్టం చేసింది. రేవంత్ సర్కారు ఈ సంవత్సరం రూ. 60 వేల కోట్ల అప్పులు చేయబోతుందని…గతంలో మేము రూ. 40 వేల కోట్ల అప్పులు తీసుకుంటే అప్పులు అప్పులు అని గోబెల్స్ ప్రచారం చేశారని మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇప్పుడు రేవంత్ సర్కారు రూ. 59,625 కోట్లు అప్పుగా తెస్తామని బడ్జెట్‌లో తెలిపారని ఫైర్ అయ్యారు హరీష్ రావు.

రైతుబంధుకు రామ్ రామ్, రుణమాఫీ వాదనంవ్రద్దు, పంటలకు బోనస్ బోగస్ అన్నట్టుగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని ఫైర్ అయ్యారు. .19,746 కోట్ల వ్యవసాయ బడ్జెట్ లో జీతాలే 3 వేల కోట్లు. మిగతా డబ్బులో పంట బీమా, ఋణ మాఫీ, రైతు బంధు ఎలా అమలు చేస్తారు.
ఒక్క రైతు భరోసాకే 22 వేల కోట్లు కావాలన్నారు. రుణమాఫీ ప్రకటన లేదు. రైతులకు తీవ్ర నిరాశ మిగిల్చింది బడ్జెట్ అంటూ విరుచుకుపడ్డారు హరీష్ రావు. రైతు బీమా అందరికీ చేశాం. మీరు కౌలు రైతులకు చేస్తా అన్నారు.వడ్లు, మక్కలు, మంది, సోయ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news