పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీ..!

-

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. మరికొంత మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. వారికీ అండగా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బ్యాంకులు కూడా పలు నోటిఫికెషన్స్ ని వేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

punjab bank

ఇప్పటికే బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన అనుభవం ఉందా. అయితే మీకు శుభవార్త. పంజాబ్ నేషనల్ బ్యాంక్ త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇక తమ సేవలను విస్తరించాలని ఆ బ్యాంకు భావిస్తోందని సీఈఓ మల్లికార్జున రావు తెలిపారు. ఈ నేపథ్యంలో దాదాపు 500 కొత్త బ్రాంచులను ప్రారంభించాలని నిర్ణయించారు.

దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 4000 ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు సీఈఓ మల్లికార్జున రావు తెలిపారు. బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారికి శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 500 కొత్త బ్రాంచులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్తగా 4000 ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు సీఈఓ మల్లికార్జున రావు తెలిపారు.

ఇక యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రెండూ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఉద్యోగుల విలీన ప్రక్రియ కూడా పూర్తయిందని అన్నారు. అలాగే పీఎన్‌బీ ప్రస్తుతం 11 వేల బ్రాంచులను కలిగి ఉందన్నారు. ఉత్తర, తూర్పు భారత దేశంలో నూతనంగా 500 బ్రాంచులను ప్రారంభించనున్నట్లు వివరించారు. ఇక నవంబర్ 15 నాటికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాదాపు 4 వేల ఉద్యోగులను తమ పేరోల్ కింద చేర్చుకుంటుదని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version