ఢిల్లీ యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని శివాజీ కాలేజ్‌ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

jobs

పూర్తి వివరాల లోకి వెళితే.. ని శివాజీ కాలేజ్‌ లో 101 టీచింగ్‌ పోస్టులు వున్నాయి. బయోకెమిస్ట్రీ, బోటనీ, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్‌ తదితర వాటిలో ఈ ఖాళీలు వున్నాయి. ఇక ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది చూస్తే.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుండి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ/ఎంఫీల్‌/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో 55 శాతం స్కోర్ చేసుండాలి.

అలానే టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. 25 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి. యూజీసీ నెట్‌/సీఎస్‌ఐఆర్‌ నెట్‌లో సెలెక్ట్ అయ్యి ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే నవంబర్ 7, 2022వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద ఖచ్చితంగా రూ.500లు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వుంది. ఇక శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.57,700ల నుంచి రూ.1,82,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను https://colrec.uod.ac.in/ లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version