మునుగోడు పోలింగ్ ఏర్పాట్లలో బిజీబిజీగా అధికారులు

-

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తోంది. అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో బిజీబిజీ అయ్యారు. ఓటింగ్ కు మరో 8 రోజులే ఉండటంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 105 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. అక్కడ ప్రత్యేక బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నల్గొండ కలెక్టర్‌ వినయ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

నాంపల్లిలోని పోలింగ్‌ కేంద్రం వద్ద కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి ఓటింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్‌ కేంద్రంలోని గదుల్లో ఫర్నీచర్‌, లైటింగ్‌, వెబ్‌క్యాస్టింగ్‌తో పాటు సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరో రెండు మూడు రోజుల్లో కేంద్రాలన్నీ పోలింగ్‌ కోసం సిద్ధమవుతాయన్న ఆయన.. ఒకటో తేదీ సాయంత్రం 6గంటల్లోగా స్థానికేతరులంతా నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని చెప్పారు.

“మునుగోడు నియోజకవర్గంలోని అన్ని కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ద్వారా పోలింగ్‌ నిర్వహిస్తాం. ఎన్నికల నియమావళి ప్రకారం 1వ తేదీ సాయంత్రం ఆరుగంటల తరువాత ప్రచారం నిలిపివేస్తాం. ఆ సమయానికి స్థానికేతరులంతా నియోజకవర్గం నుంచి బయటికి వెళ్లిపోవాల్సి ఉంటుది”.- వినయ్​కుమార్​రెడ్డి, నల్గొండ కలెక్టర్​

Read more RELATED
Recommended to you

Exit mobile version