ESICలో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలు.. వివరాలివే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ESIC (ESIC Medical College & Hospital Faridabad) 92 ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఈ నెల 16న నోటిఫికేషన్లో సూచించిన ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు అవ్వాల్సి ఉంటుంది.

 

jobs

ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. మొత్తం 92 ఖాళీలను భర్తీ చేస్తుండగా.. సీనియర్ సీనియర్ రెసిడెంట్ విభాగంలో 66 పోస్టులు వున్నాయి. అలానే సీనియర్ రెసిడెంట్ ఎగైనెస్ట్ GDMO విభాగంలో 26 ఖాళీలు వున్నాయి. అర్హత, ఆసక్తి వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు.

సీనియర్ రెసిడెంట్ అర్హత చూస్తే… సంబంధిత విభాగంలో పీజీ లేదా పీజీ డిప్లొమో చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు వచ్చేసి ఆగస్టు 16 నాటికి 45 ఏళ్ల లోపు ఉండాలి. అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అని తెలిపారు.

అదే సీనియర్ రెసిడెంట్ ఎగైనెస్ట్ GDMO ఏడాది పోస్టుకి అయితే ఆగస్టు 16 నాటికి 45 ఏళ్లను మించకూడదు. అలానే సంబంధిత విభాగంలో పీజీ/DNB/డిప్లొమో చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ESIC Medical College & Hospital Faridabad, Haryana చిరునామాలో ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ లింక్ : https://www.esic.nic.in/attachments/recruitmentfile/bc8a98102e14d1e0792c8147123bbaff.pdf

 

Job Notification : టెన్త్ అర్హ‌త‌తో 269 గ్రూప్‌-సీ కానిస్టేబుల్‌ పోస్టులు…

UPSC CDS 2021: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు.. వివరాలివే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version