మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ లో బీబీనగర్ లోని ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. నాన్ అకాడమిక్ విభాగంలో సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్ల పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.
నవంబర్ 11లోగా ఈ మెయిల్ (ace.aiimsbbnagar@gmail.com) ద్వారా అప్లై చేసుకోవాల్సి వుంది. ఇక పోస్టుల వివరాలలోకి వెళితే… దీనిలో మొత్తం 38 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో జనరల్ మెడిసిన్&అనస్తేషియా, పీడియాట్రిక్స్&CFM , బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయోలజీ, ఆర్థోపెడిక్స్, ఫార్మకాలజీ అండ్ రేడియాలజీ మొదలైన విభాగాల్లో ఖాళీలున్నాయి. MD/ MS/ DM/ M.Ch/ DNB విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
ఇది ఇలా ఉంటే ఇంటర్వూస్ ని నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తారు. రూ. 1500లను అప్లికేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ, EWS అభ్యర్థులకు ఫీజులో రూ. 300 రాయితీ ఇచ్చారు. వారు రూ. 1200 చెల్లిస్తే సరిపోతుంది. మహిళలు, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. అలానే జూనియర్ రెసిడెంట్స్ విభాగంలో మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/ స్టేట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వయస్సు వచ్చేసి 37 ఏళ్లలోపు ఉండాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయస్సు 37 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడచ్చు.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.