పదో తరగతి అర్హతతో బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు..వివరాలివే..

-

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్
.. ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల భర్తీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తుంది.. నిరుద్యోగ సమస్యలను తగ్గించడానికి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది.. కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ 1410 కానిస్టేబుల్ (ట్రేడ్‌మ్యాన్‌) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. వివరాలిలా..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణతతో పాటు ప్లంబర్‌/పెయింటర్‌/ఎలక్ట్రీషియన్‌/పంప్‌ ఆపరేటర్‌/డ్రాఫ్ట్‌మ్యాన్‌/టిన్‌స్మిత్‌/టైలర్‌/కాబ్లర్‌/బార్బర్‌/మాలి/స్వీపర్‌/వాషర్‌మ్యాన్/కుక్‌/వాటర్‌ క్యారియర్‌/వెయిటర్/బట్చర్ తదితర స్పెషలైజేషన్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ కూడా ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక కొలతలు కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి..

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష/ఫిజికల్‌ టెస్టుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.. సెలెక్ట్ అయినవారికి నెలకు రూ.21,700 ల నుంచి రూ.69,100ల వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.. మరింత సమాచారం కోసం.. rectt.bsf.gov.in.. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.. ఆసక్తి కలిగిన విద్యార్థులు వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Exit mobile version