ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో భారీగా ఉద్యోగాలు… ఇలా అప్లై చేసుకోండి…!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ పలు ఖాళీలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ లా ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ లాంటి పోస్టుల్ని ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ భర్తీ చేయనుంది.

jobs

దీనిలో 878 ఖాళీలు ఉన్నాయి అని నోటిఫికేషన్ లో వుంది. వేరు వేరు పోస్టులకి వేర్వేరు విద్యార్హతలు వున్నాయి. వాటిని నోటిఫికేషన్ లో చూడచ్చు. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు ప్రక్రియ 2021 జనవరి 10న ప్రారంభం కానుంది. అలానే అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 9 చివరి తేదీ.

2022 మార్చి 1న పరీక్ష ఉండనుంది. ఇక వయస్సు విషయానికి వస్తే.. 18 నుంచి 27 ఏళ్లు వున్నవాళ్లు అర్హులు. ఇక ఎలా ఎంపిక చేయనున్నారు అనే విషయానికి వస్తే.. టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్ ని నిర్వహించి వాటి ఫలితాలు ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

దరఖాస్తు ఫీజు వచ్చేసి రూ.100. మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు, దివ్యాంగులకు ఫీజు లేదు. పూర్తి వివరాలని https://dsssbonline.nic.in/ లో చూసి అప్లై చెయ్యచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version