ఐసీఏఐలో ఖాళీలు.. వివరాలు ఇవే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ICAI) అసిస్టెంట్, LDC మరియు UDC నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

jobs

అభ్యర్థులు ప్రకటన విడుదలైన 15 రోజుల్లోపు పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 22 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. అసిస్టెంట్ (ఎకౌంట్స్‌) – 2,
అసిస్టెంట్ 3 ఏళ్లు – సివిల్ ఇంజ‌నీర్ – 2, యూడీసీ – 3, అసిస్టెంట్‌- ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ – 1. అభ్యర్థులు ఈ-మెయిల్ రాసి recruit2021@icai.in కి పంపాలి లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లై చెయ్యచ్చు.

ఇది ఇలా ఉంటే అసిస్టెంట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఎంకామ్‌/ఎంబీఏ ఫైనాన్స్, ఎంసీఏ/ఎంఈ లేదా ఎంటెక్, సివిల్ ఇంజనీంగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభ‌వం ఉండాలి గమనించండి. ఇది ఇలా ఉంటే యూడీసీ పోస్టు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి తప్పక ఏదైనా గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ఐదేళ్ల డిగ్రీ చేసి ఉండాలి. అదే విధంగా టైపింగ్ స్పీడ్ 40 వ‌ర్డ్స్ ఉండాలి. ద‌ర‌ఖాస్తు క‌వ‌ర్ మీద అసిస్టెంట్ / UDC / LDC ఏ పోస్టుకు అప్లై చేసుకుంటున్నారో వ్రాయసి ఉంటుంది.

స్పీడ్ పోస్ట్ ద్వారా ద‌ర‌ఖాస్తు పంపాల్సిన అడ్ర‌స్‌:
జాయింట్ డైరెక్టర్-HR,
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా,
ICAI భవన్, IPMarg,
న్యూఢిల్లీ -110002

Read more RELATED
Recommended to you

Exit mobile version