ఇప్పడు తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా వినిపించే అంశం హుజూరాబాద్ ఉప ఎన్నిక. ఈ ఎన్నిక అన్ని పార్టీలకు చాలా సీరియస్ అంశమనే చెప్పాలి. ఇక్కడ గెలిచేందుకు ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఈ ప్రచారా్లో మిగతా పార్టీల కంటే కూడా ఈ రెండు పార్టీలు ఓ అడుగు ముందే ఉన్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఎన్నికల్లో హైలెట్‌గా నిలుస్తున్నారు. టీఆర్ ఎస్ కూడా ఎక్కడా తగ్గకుండా పార్టీ అభ్యర్థిని ప్రకటించి హామీలు, కొత్త పథకాలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.
ఇక హుజూరాబాద్‌లో బీసీ జనాభా ఎక్కువగా ఉండటం అలాగే బీజేపీ నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటల బరిలోకి దిగడంతో టీఆర్ ఎస్ కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ అయిన బీసీనే బరిలో దింపింది. కానీ కాంగ్రెస్ ను కౌశిక్‌రెడ్డి వీడటంతో అప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి చెందిన బలమైన నేతలు కాంగ్రెస్‌కు దొరకట్లేదు. అసలు పార్టీ తరఫున పోటీ చేయాలంటేనే పేరున్న లీడర్లు ఎవరూ ముందుకు రావట్లేదు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొండా సురేఖ పేరు తెరపైకి వచ్చింది.
అయితే ఆమె అభ్యర్థిత్వంపై ఇప్పటి దాకా ఆమె కనీసం నోరువిప్పకుండా సైలెంట్ గానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె హుజూరాబాద్ ఉప ఎన్నికపై స్పందించారు. తనను పోటీ చేయాలంటూ కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు అడిగారని, కాగా దానిపై తన సొంత నిర్ణయం ఏమీ లేదన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఆలోచిస్తున్నానని, కానీ అయితే భవిష్యత్ లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారి దగ్గరి నుంచి కొన్ని ప్రధాన హామీలను కోరానని తెలిపింది కొండా సురేఖ. ఇక తాను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.