మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం వాఖానాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పల్లెదావాఖానాల్లో ఖాళీలను డీఎంహెచ్ఓల ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ పల్లె దవాఖానాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి వుంది. దరఖాస్తుల ప్రక్రియ ను ఈ నెల 20న ప్రారంభించారు.
అప్లై చేసుకోవడానికి నవంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. కనుక ఈ లోగా అప్లై చేసుకోవాలి. ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. అభ్యర్థులు ఇతర పూర్తి సమాచారం కోసం https://bhoopalapally.telangana.gov.in/ ను సందర్శించాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే..
ముందుగా https://bhoopalapally.telangana.gov.in/notice_category/recruitment/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఫామ్ లో వివరాలని నింపి.. అప్లికేషన్ ఫామ్ కు టెన్త్, ఇంటర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ వంటివి అవసరం అవుతాయి. వాటిని జత చేయాలి.
అప్లికేషన్ ఫామ్ కు DM&HO, జయశంకర్ భూపాలపల్లి పేరిట తీసిన రూ. 500 డీడీని జత చేయాలి.
దీనిని మీరు DM&HO జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంలో సర్పించాలి.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.