టెన్త్ అర్హత తో NDA లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. పుణె లోని ఖడక్వస్లకు చెందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…

నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో మొత్తం 251 పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక వయస్సు విషయానికి వస్తే… అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్యన ఉండాలి. ఇక పోస్టుల వివరాలని చూస్తే.. డ్రాఫ్ట్‌ మెన్‌, సివిలియన్‌ మోటర్‌ డ్రైవర్, పెయింటర్‌, కుక్‌, ఫైర్‌మ్యాన్‌, ఎంటీఎస్‌, ఎల్‌డీసీ, బ్లాక్‌ స్మిత్‌, సైకిల్‌ రిపేయర్‌ వంటి పోస్టులు ఖాళీగా వున్నాయి.

ఇక అర్హత వివరాలని చూస్తే పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్‌ లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సు ని పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టుల కి అప్లై చేసుకోవడానికి జనవరి 21, 2023 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలని https://ndacivrect.gov.in/ లో చూసి అప్లై చేసుకో వచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version